సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (22:48 IST)

ద్రాక్షలో వుండే ఆరోగ్య ప్రయోజనాలు

ద్రాక్షలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ముఖ్యమైన పోషకాలున్నాయి. ద్రాక్షలో చక్కెర శాతం ఉన్నప్పటికీ, మితంగా తినేటప్పుడు అవి రక్తంలో చక్కెర నియంత్రణను ప్రతికూలంగా ప్రభావితం చేయవు. ద్రాక్ష చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

 
ద్రాక్షలో వుండే రెస్వెరాట్రాల్ చర్మం- జుట్టుకు రక్షణనిస్తుంది. అలాగే సూర్యరశ్మి నుండి అల్ట్రావైలెట్ కిరణాల వల్ల కలిగే ఇబ్బందిని ఇది ఎదుర్కొంటుంది. రెస్వెరాట్రాల్ జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.

 
ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ జ్యూస్ తాగడం వలన చర్మం సురక్షితంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి. ఇవి రక్తంలో గడ్డలు ఏర్పడకుండా నివారిస్తుంది.