శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (09:12 IST)

తెలంగాణాలో గ్రేప్ ఫెస్టివల్ - తిన్నోళ్లకు తిన్నంత ద్రాక్ష

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగరులో ఉన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ద్రాక్ష పళ్ళ పండుగను ఏర్పాటుచేశారు. గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహించలేక పోయారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. 
 
ద్రాక్ష పరిశోధనా కేంద్రంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ శనివారం ప్రారంభమైంది. ప్రజలు ద్రాక్షను కొనుగోలు చేసే ముందు వాటిని రుచి చూడటమే కాకుండా, వారే స్వయంగా తమకు నచ్చిన ద్రాక్షను ఎంపిక చేసుకోవచ్చు. 
 
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ ఉత్సవాన్ని నిర్వహించలేదు. ఈ సంవత్సరం వారు కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఇందులో 37 రకాల ద్రాక్ష పండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు.