ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2024 (17:34 IST)

రోహిత్ శర్మ మా జట్టుకు రావాలి.. ముంబైతో మాట్లాడుతాం..?

Rohit Sharma
ఐపీఎల్-17వ సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. ట్రెండింగ్‌లో వున్న హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసింది. ఆపై హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. 
 
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా అసంతృప్తిలో వున్నారు. ఓ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ ఇచ్చిన సలహాను హార్దిక్ పాండ్యా నిర్లక్ష్యం చేయడం వివాదాస్పదమైంది. ఈ వివాదం గురించి రోహిత్, హార్దిక్ ఇప్పటివరకు సరైన వివరణ ఇవ్వలేదు. రోహిత్‌ను ఇలా అవమానించడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వేరొక జట్టులోకి వెళ్లే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కోచ్ జస్టిన్ లెంగర్.. "రోహిత్ శర్మ మా జట్టుకు రావాలి. ముంబై జట్టుతో మాట్లాడుతాము" అని అన్నారు.