ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (10:00 IST)

సచిన్ టెండూల్కర్ ఆ రికార్డు సృష్టించింది ఈ రోజే... (వీడియో)

అది మార్చి ఒకటో తేదీ 2003వ సంవత్సరం. వన్డే మ్యాచ్‌లలో 12 వేల పరుగులు చేయడానికి భారత పరుగుల యంత్రానికి కావాల్సింది మరో 83 పరుగులు మాత్రమే. ఆ రోజున సెంచూరియన్ పార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరిగిన వన

అది మార్చి ఒకటో తేదీ 2003వ సంవత్సరం. వన్డే మ్యాచ్‌లలో 12 వేల పరుగులు చేయడానికి భారత పరుగుల యంత్రానికి కావాల్సింది మరో 83 పరుగులు మాత్రమే. ఆ రోజున సెంచూరియన్ పార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ఈ అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు. 
 
పూల్-ఏ మ్యాచ్‌లో భాగంగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 98 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్ షాహిద్ ఆఫ్రిది వేసిన బంతిని బౌండరీకి పంపిన టెండూల్కర్ చివరకు వన్డేల్లో 12 వేల పరుగులు చేశాడు. ఈ అరుదైన ఫీట్‌ను సచిన్ టెండూల్కర్ తన 309వ వన్డే మ్యాచ్‌లో పూర్తి చేశాడు. 
 
అయితే, ఈ మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులతో 35వ సెంచరీని మిస్ చేసుకున్నాడు. షోయర్ అక్తర్ విసిరిన బంతిని ఆడబోయి యూనిస్ ఖాన్‌కు సచిన్ క్యాచ్ ఇచ్చి 98 పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియోను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.