గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

పరుగుల సునామీ... 27 ఫోర్లు... 57 సిక్స్‌లు... 490 రన్స్

క్రికెట్ ప్రపంచంలో ఒక క్రికెటర్‌కు నమ్మశక్యంగానీ స్కోరును సాధించాడో క్రికెటర్. అతనిపేరు షేన్ డాడ్స్ వెల్. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 27 ఫోర్లు, 57 సిక్స్‌లతో మొత్తం 490 పరుగుల చేశాడు.

క్రికెట్ ప్రపంచంలో ఒక క్రికెటర్‌కు నమ్మశక్యంగానీ స్కోరును సాధించాడో క్రికెటర్. అతనిపేరు షేన్ డాడ్స్ వెల్. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 27 ఫోర్లు, 57 సిక్స్‌లతో మొత్తం 490 పరుగుల చేశాడు. ఈ పరుగుల సునామీ ధాటికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేతులెత్తేశారు. ఫీల్డర్లు మాత్రం ప్రేక్షక పాత్ర వహించి ఫోర్లు, సిక్స్‌లను చూస్తుండిపోయారు. 
 
ఫలితంగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది నిజంగా నమ్మలేని నిజంగా రికార్డుపుటలకెక్కింది. ఒక రోజు అంతర్జాతీయ పోటీల్లో 250 పరుగులకు పైగా స్కోరు సాధిస్తే, విజయానికి బాటలు వేసుకున్నట్టే. మన రోహిత్ శర్మ ఒక మ్యాచ్‌లో 264 పరుగులు చేస్తే, అబ్బురపడి చూశాం. కానీ, అసలు సిసలైన పరుగుల సునామీ అంటే ఎలా ఉంటుందో చూపించాడీ దక్షిణాఫ్రికా ప్లేయర్. 
 
క్లబ్ లెవల్ ప్రేయర్ అయిన 20 సంవత్సరాల షేన్ డాడ్స్ వెల్, ఎన్‌డబ్ల్యూయు క్లబ్ తరఫున ఆడుతూ, పోర్చ్‌డార్ప్ ఫస్ట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అరుదైన ఫీట్ సాధించాడు. శనివారం పుట్టిన రోజు జరుపుకున్న డాడ్స్ వెల్, 151 బంతులను ఎదుర్కొని, 27 ఫోర్లు, 57 సిక్సులతో 490 పరుగులు సాధించాడు. దీంతో ఆ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 677 పరుగులు చేయడం గమనార్హం. ఈ మ్యాచ్ లో 387 పరుగుల భారీ తేడాతో ఎన్‌డబ్ల్యూయూ జట్టు విజయం సాధించింది.