శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (10:52 IST)

డబుల్ కాదు.. ట్రిపుల్ సెంచరీ చెయ్యవయ్యా.. కోహ్లీ-మయాంక్ సైగల వీడియో వైరల్

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన సైగలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న తొలి డే/నైట్ మ్యాచ్‌ ఇండోర్‌లో జరుగుతోంది.

గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 58.3 ఓవర్లకే కుప్పకూలిన బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌటైంది. తదనంతరం బరిలోకి దిగిన టీమిండియా జట్టులో రోహిత్ శర్మ 6 పరుగులకు, విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. 
 
పుజారా అర్థ సెంచరీతో వెనుదిరగగా, మయాంక్ మైదానంలో మాయాజాలం చేశాడు. డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. తద్వారా టెస్టు కెరీర్‌లో మూడో సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ-మయాంక్ సైగలు చేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మయాంక్ మైదానంలో టంబ్, బ్యాటునెత్తి చూపెట్టగా.. కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఐదువేళ్లను చూపెట్టాడు. 
 
50 పరుగులతో డబుల్ సెంచరీ కొట్టాల్సిన రెండు చేతి వేళ్లను కూడా చూపెట్టాడు. ఇందుకు ఓకే అన్నట్లు టంబ్ చూపెట్టాడు మయాంక్. డబుల్ సెంచరీతో తర్వాత రెండు శతకాలు కొట్టానని రెండు వేళ్లు చూపెట్టాడు మయాంక్. మీరు చెప్పింది చేసేశాను అన్నట్లు మయాంక్ సైగలున్నాయి. అంతటితో ఆగకుండా విరాట్ కోహ్లీ మూడు చేతివేళ్లను చూపెట్టి ట్రిబుల్ సెంచరీ చేయాల్సిందిగా కోరాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.