సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 14 జులై 2019 (15:01 IST)

వరల్డ్ కప్ ఫైనల్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ - ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఇందులో తొలుత టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
ఇప్పటివరకు జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో ఈ రెండు జట్లూ విశ్వవిజేతగా నిలువలేక పోయాయి. భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు గతంలో విశ్వవిజేతగా అవతరించాయి. దీంతో ఈ దపా సరికొత్త జట్టు విశ్వవిజేతగా అవతరించనుంది. 
 
అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మ్యాచ్‌కు ఆటంకం కలిగితే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఓవర్లను కుదింపు చేసే అవకాశం ఉంది. అలాకాకుండా, మ్యాచ్‌ను రిజర్వ్ డేకు మారిస్తే తొలిరోజు నిలిచిన చోట నుంచే తిరిగి ప్రారంభిస్తారు. 
 
రిజర్వ్ డే న కూడా వర్షం వస్తే ఓవర్లు కుదించి డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ నిర్వహించనున్నారు. ఒకవేళ రిజర్వ్ డే నాడు రోజంతా వర్షం కొనసాగితే కనుక ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారని సమాచారం.
 
ఇరు జట్ల వివరాలు... 
ఇంగ్లండ్ : జాసన్ రాయ్, బెయిర్‌స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, క్రిస్ వోక్స్, లిమ్ ఫ్లుంకెట్, జొఫ్రా అర్చర్, అడిల్ రషీద్, మార్క్ వుడ్. 
 
న్యూజిలాండ్ : మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, జేమ్స్ నీషమ్, థామ్ లాథమ్, కోలిన్ డీ గ్రాండ్‌హోమ్స్, మిచెల్ సత్నర్, హెన్రీ, బౌల్ట్, ఫెర్గ్యూసన్.