ప్రపంచ కప్ నుంచి అవుట్.. భావోద్వేగానికి గురైన శిఖర్ ధావన్ (వీడియో)

Last Updated: గురువారం, 20 జూన్ 2019 (14:34 IST)
ప్రపంచ కప్ నుంచి గాయం కారణంగా తొలగిపోవడంపై టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు. ప్రపంచకప్‌కు దూరమవుతున్నందుకు చాలా బాధగా ఉందని.. తాను లేకపోయినా భారత జట్టు మంచి ప్రదర్శనతో రాణించాలని ఆకాంక్షించాడు. ప్రపంచ కప్‌లో ఆడాలని వున్నా.. బొటనవేలి గాయం ఇంకా నయం కాలేదు. 
 
తాను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని శిఖర్ ధావన్ తెలిపాడు. భారత జట్టు సమిష్టిగా ఆడి.. ప్రపంచ కప్ గెలుచుకుంటుందని శిఖర్ ధావన్ ఆ వీడియోలో చెప్పాడు. 
 
కాగా, ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా కమిన్స్ బౌలింగ్‌లో శిఖర్ ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది.రెండు వారాల్లో అతను కోలుకుంటాడని మొదట భావించినప్పటికీ గాయం తీవ్రత కారణంగా అతను ఇప్పట్లో కోలుకోలేడని బీసీసీఐ నిర్ధారించింది. దీంతో ధావన్‌ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.ధావన్ స్థానంలో రిషబ్ పంత్ ఇప్పటికే టీమ్‌తో చేరిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :