శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2024 (16:01 IST)

నాలుగేళ్ల చిన్నారిపై తండ్రి స్నేహితుడు అత్యాచార యత్నం

నాలుగేళ్ల చిన్నారిపై ఆమె తండ్రి స్నేహితుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన హైదరాబాదులోని బౌరంపేట పరిధిలో జరిగింది. గాయాలపాలైన బాలికను హైదర్ నగర్ లోని రెయిన్ బో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
చిన్నారిని పరామర్శించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖామంత్రి సీతక్క వచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఆడపిల్లలపై కిరాతకులుగా మారి దాడులు చేసే వారు ఎక్కువయ్యారు. తండ్రి స్నేహితుడే చిన్నారిపై అఘాయిత్యం చేశాడనీ, తన కన్నబిడ్డలా చూడాల్సిన అతడే కిరాతకుడిలా మారాడని అన్నారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.