శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (09:47 IST)

బాలుడిపై న్యాయమూర్తి అత్యాచారం.. ఎక్కడ?

బాధితులకు న్యాయం చేయాల్సిన న్యాయమూర్తే నేరానికి పాల్పడ్డాడు. ఓ బాలుడుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తన వద్ద పనిచేసే మరో ఇద్దరితో కలిసి ఈ పాడు పనికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగింది. 
 
ఏసీబీ కేసులను విచారించే ప్రత్యేక నాయమూర్తి జితేంద్ర సింగ్‌ గోలియా, ఆయన వద్ద స్టెనోగా పనిచేసే అన్షుల్‌ సోని, మరో ఉద్యోగి రాహుల్‌ కటారియా.. తమ కుమారుడికి మత్తు మందు ఇచ్చి నెలరోజులుగా లైంగికవేధింపునకు గురిచేస్తున్నారని బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తమ అఘాయుయిత్యాలను ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించాని ఆమె ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ బాధ్యతను ఓ పోలీసు ఉన్నతాధికారికి అప్పగించారు. 
 
కాగా బాధిత బాలుడిని చంపుతామని ఎసీబీ సర్కిల్‌ అధికారి పరమేశ్వర్‌ లాల్‌ యాదవ్‌, నిందితులు సోని, కటారియా బెదిరించినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు.