సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 12 జులై 2022 (16:48 IST)

నీవిక్కడికి వస్తే ఉద్యోగం తప్పక వస్తుందని పిలిచి యువతిపై ఎస్సై లైంగిక వేధింపులు

rape
తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళపై సీఐ అత్యాచారం ఘటన మరవకముందే మరో ఖాకీ కీచకుడుగా మారాడు. తన వద్ద వున్న పుస్తకాలు చదివితే ఉద్యోగం వచ్చేస్తుందని యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.

 
పూర్తి వివరాలు చూస్తే... కొమురం భీం జిల్లాలో పనిచేస్తున్న ఎస్సై పోలీసు ఉద్యోగానికి యత్నిస్తున్న యువతిపై కన్నేసాడు. తన వద్ద వున్న పుస్తకాలు చదివితే ఉద్యోగం వస్తుందని ఆమెకి మాయమాటలు చెప్పి పోలీసు స్టేషనుకి రప్పించాడు.

 
పుస్తకాలు ఇస్తానని చెప్పి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో ఆమె అక్కడి నుంచి ఎలాగో బయటపడి విషయాన్ని తన సమీప బంధువుకి చేరవేసింది. దాంతో అతడి బాగోతం బయటపడింది. గతంలో కూడా ఈ ఎస్సై పలువురి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో అతడి పైన అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం.