గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (11:25 IST)

చిన్నమాటపై గొడవ.. పిజ్జా డెలివరీ గర్ల్‌‌పై దాడి.. వీడియో వైరల్

Girl
Girl
చిన్నమాటపై గొడవ జరగడంతో నలుగురు అమ్మాయిలు తమ స్నేహితురాలిపై రక్కసుల్లా దాడి చేశాయి. నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని, ఈడ్చి, పిడిగుద్దులు గుద్దారు. 
 
చుట్టూ ఉన్నవాళ్లు వినోదంలా చూశారే తప్ప దాడిని అడ్డుకోలేదు. పిజ్జా డెలివరీ గర్ల్‌గా పనిచేస్తున్న బాధితురాలి ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. నందినీ యాదవ్ అనే యువతి డోమినో కంపెనీలో పిజ్జా డెలివరీ గర్ల్‌గా పనిచేస్తోంది. 
 
ఆమె పనిపై వెళ్తుంగా పింకీ అనే యువతి, మరో ముగ్గురు ఏదో అన్నారు. నందిని కూడా వాళ్లను ఘాటుగా బదులిచ్చింది. గొడవ పెరిగింది. పికీ అండ్ కో కర్రలు తీసుకుని నందినిపై దాడి చేశారు. 
 
కిందపడేసి కొట్టారు. నందిని తనను కాపాడుకోడానికి ఓ ఇంట్లోకి వెళ్లింది. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.