గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 అక్టోబరు 2021 (18:07 IST)

స్వచ్ఛమైన నీటి చెరువు గట్టుపైకి వెళ్లారు, ముగ్గురు యువతులు దూకేశారా? పడిపోయారా?

స్వచ్ఛమైన నీటితో కూడిన చెరువ గట్టుకు వెళ్లారు ముగ్గురు యువతులు. ఐతే ఏం జరిగిందో ఏమో కానీ ముగ్గురూ కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వచ్చంగా తొణికసలాడుతున్న నీటిలో యువతుల మృతదేహాలను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 
ఈ ఘటన జగిత్యాల జిల్లాలో ధర్మసముద్రం చెరువు వద్ద చోటుచేసుకుంది. కాగా మృతి చెందినవారు దేవి, మల్లిక, వందనగా గుర్తించారు. మొదటి ఇద్దరికీ వివాహాలు కాదా వందన అవివాహిత. ఐతే వీరు ముగ్గురూ కలిసి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారన్నది మిస్టరీగా మారింది.

 
మానసికంగా బలహీనంగా వున్నవారు ఎత్తయిన కట్టడాల పైకి ఎక్కినా, అలాగే ఇలాంటి నీటి చెరువుల వద్దకు వెళ్లినా కళ్లు తిరిగి పడిపోయే ఆస్కారం వుందని చెపుతున్నారు నిపుణులు. ఇలాంటి దారుణమేదైనా జరిగిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.