శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Updated : బుధవారం, 24 జులై 2019 (17:34 IST)

కమలనాధులకు త్వరలో కర్నాటక కుర్చీ... నెక్ట్స్ మధ్యప్రదేశ్ కమల్‌నాథ్ పైన టార్గెట్...

కర్ణాటకలో కమలనాధులు అధికార పగ్గాలు చేపట్టిన మూడు రోజుల్లోనే అధికారాన్ని చేజార్చుకున్నా 14 నెలల సంకీర్ణ ప్రభుత్వం లోని లొసుగులను చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ జేడీఎస్ మిత్ర పక్షాల్లోని అసమ్మతిని అవకాశంగా మలుచుకుని కుమార స్వామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు. బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా సూచనలతో యడ్యూరప్ప పక్కా పథకం ప్రకారం పని పూర్తి చేసాడు.
 
కుమార స్వామి, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య 4కి పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లు మాత్రమే. ఇక భారతీయ జనతాపార్టీ దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకను తమ ఖాతాలో వేసుకోబోతుండటంతో బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య 16కి చేరింది. 
 
ఇదిలా ఉంటే కర్నాటకలో తమ పనిని ఫక్కగా ఫినిష్ చేసిన బాజపా బాద్ షాగా పెరొందిన అమిత్ షా ఇప్పుడు మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌పై టార్గెట్ పెట్టారా? అంటే అవుననే సమాధానం చెపుతున్నారు ఆ రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ నేత జీతూ పట్వారీ. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన నేపధ్యంలో పట్వారీ మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక మాదిరిగానే ఇక్కడ కూడా తమ సర్కార్‌ను ఇబ్బంది పెట్టడానికి, సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తారని అయితే ఇక్కడున్నది కమల్‌నాథ్ ప్రభుత్వమని, కుమారస్వామి ప్రభుత్వం కాదని ఆయన అన్నారు.
 
కర్నాటక విధాన సభలో అధికార కాంగ్రెస్ పార్టీకి 114 స్థానాలు ఉంటే , బీజేపీకి 108 స్థానాలు ఉన్నాయి. బి.ఎస్.పి, ఎస్.పి మరో ఇతర పార్టీలతో కలిపి కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోసిపుచ్చారు. 
 
ప్రభుత్వాలు కూలిపోతే అందుకు భారతీయ జనతా పార్టీ ఎంతమాత్రం కారణం కాబోదని, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలే ప్రభుత్వాలు పడిపోవడానికి కారణాలు అవుతాయని తెలియజేశారు. అయితే తాజాగా శివరాజ్ సింగ్ చౌహన్ మాటలను నిశితింగా పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ ‘నెక్ట్స్ టార్గెట్ మధ్యప్రదేశ్’ అనే రాజీకయ విశ్లేషకులు అంచనా.. మరి కమలనాధుల రాజీకీయ ఎత్తులను ఈ కాంగ్రెస్ కమలనాథ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.