మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జెఎస్కె
Last Updated : బుధవారం, 28 జులై 2021 (15:27 IST)

రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న ఎంతో కాలం సాగ‌దు: ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు

MP రాక్షసత్వపు రాజకీయాలని తెలుగునాట పెంచి పోషిస్తున్న వైసీపీ పాలనలో మరో మైలురాయి నమోదయ్యింద‌ని టీడీపీ ఎంపీ కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడు అభివ‌ర్ణించారు. ఏపీలో నానాటికి పెరుగుతున్న అరాచకత్వం పతాక స్థాయికి చేరింద‌ని, దేవినేని ఉమాపై జరిగిన దాడి దురదృష్టమే కానీ అందులో ఆశ్చర్యం లేద‌న్నారు.

విధ్వంసాలు తప్ప, పరిపాలన చేతకాని ఈ ప్రభుత్వం నుండి ఇంత కన్నా ప్రజలు ఏం ఆశించగలరు? అని ప్ర‌శ్నించారు. వైసీపీ గూండాలు చేస్తున్న దుర్మార్గాలు, పిరికిపంద చర్యలకు మేం భయపడం!

మా కార్యకర్తలకు జరుగుతున్న ప్రతి అన్యాయానికి జవాబు చెప్పే రోజు దగ్గరలోనే ఉంద‌న్నారు. దుర్మార్గం, అరాచకత్వం, రాక్షసత్వం, విధ్వంసం... ఈ నాలుగు స్తంభాలే ఆధారంగా వైసీపీ కడుతున్న సామ్రాజ్యం ఎంతో కాలం సాగబోద‌ని కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.