బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (13:20 IST)

అమరావతి సచివాలయం వాస్తు బాగోలేదు.. చంద్రబాబు సీఎం కాలేరా?

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును నమోదు చేసుకుంటుందని ఆక్టోపస్, పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ సర్వే తేల్చింది. అయితే ప్రస్తుతం వాస్తు దోషం ఏపీ సీఎం చంద్రబాబును తలపట్టుకునేలా చేసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.


లగడపాటి సర్వే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఫలితాలను ఇచ్చినా.. వాస్తు నిపుణులు మాత్రం చంద్రబాబుకు వాస్తు దోషం వుండటం ద్వారా సీఎం పీఠాన్ని అధిష్టించలేరని చెప్తున్నారు. 
 
ఇందుకు అమరావతి సచివాలయమే కారణమని వాస్తు నిపుణులు చెప్తున్నట్లు మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. ఏపీ సచివాలయంలో వాస్తు దోషాలున్నందున సీఎం స్థానంలో వున్న చంద్రబాబు.. అన్ని వ్యవహారాల్లో వెనుకబడి వుంటున్నారని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
విజయవాడకు చెందిన ఓ వాస్తు సిద్ధాంతి ఈ విషయాన్ని విశ్లేషించడం ద్వారా సోషల్ మీడియాలో అమరావతి సచివాలయం వాస్తు బాగోలేదని.. ఏపీకి చంద్రబాబు సీఎం కాలేరని వార్తలు వైరల్ అవుతున్నాయి. సచివాయంలో ఈశాన్య ద్వారం మినహాయిస్తే... మిగతా అన్ని స్థానాల్లోనూ వాస్తు దోషాలు వున్నాయని ఓ సిద్ధాంతి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
అమరావతిలో సెక్రటేరియట్‌ను రూట్ ఎండ్‌కి కట్టారని.. దీంతో తప్పుడు నిర్ణయాలకు సీఎం బలి కానున్నట్లు సిద్ధాంతి చెప్తున్నారు. సీఎం కార్యాలయం ముందు అసెంబ్లీ నిర్మించడంతో తూర్పువైపు మూతపడి పోయిందట. దీనివల్ల నష్టం ఖాయమని, సెక్రటేరియట్ వాస్తు సరిగా లేకపోవడంతో.. సీఎంకు ఇబ్బందులు ఖాయమని వాస్తు సిద్ధాంతి హెచ్చరించారు.