శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By selvi
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (16:39 IST)

శ్రీకృష్ణుడిని నరకాసురుడు కోరిన వరం ఏమిటి?

విష్ణుపురాణంలో దీపావళి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి మహాలక్ష్మీదేవిని పూజించి.. దీపాలతో ఇంటిని అలంకరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్పబడింది. దీపావళి అంటేనే మనకు గుర్తొచ్చేద

విష్ణుపురాణంలో దీపావళి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి మహాలక్ష్మీదేవిని పూజించి.. దీపాలతో ఇంటిని అలంకరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్పబడింది. దీపావళి అంటేనే మనకు గుర్తొచ్చేది టపాసులు, స్వీట్లే. భగవాన్ శ్రీ కృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని వధించిన రోజునే దీపావళిగా జరుపుకుంటున్నాం. 
 
ముల్లోకాలకు చెందిన వారిని చిత్ర హింసలకు గురిచేసి శ్రీకృష్ణుడి చేతిలో వధించబడిన నరకాసురుడు మరణించేముందు.. కృష్ణుడిని ఓ వరం కోరుతాడు. ఓ అరాచకుడు మరణించిన ఈ రోజును ప్రజలు ఎంతో ఉత్సాహంగా పండగ చేసుకోవాలని కోరాడు. అతని కోరిక ప్రకారమే.. దీపావళి పండుగ రోజున టపాసులను పేల్చి.. స్వీట్లు ఇచ్చిపుచ్చుకుని అట్టహాసంగా జరుపుకుంటారు. 
 
ఈ పండుగను ఉత్తరాదిన ఐదురోజుల పాటు జరుపుకుంటారు. గుజరాత్ ప్రజలకు ఇదే రోజున ఉగాది. లక్ష్మీపూజ అట్టహాసంగా జరుపుకుంటారు. దీపావళి రోజున ఇంటిల్లపాది దీపాలతో అలంకరించి.. లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ. అంతేగాకుండా దీపావళి రోజును మహానిశగా పిలుస్తారు. రాక్షసుల రక్తాన్ని తాగడంతో కాళీ మాతకు ఏర్పడిన ఆక్రోషాన్ని శాంతింపజేసిన రోజు కూడా ఇదే కావడంతో.. ఈ రోజున ఉత్తరాదిన కాళిపూజ కూడా ప్రాశస్త్యం. 
 
కాళిమాత రూపాన్ని ప్రతిష్టించి.. దీపాల వరుసను ఏర్పాటు చేసి.. వాటిని వెలిగిస్తారు. స్కంధ పురాణం ప్రకారం పరాశక్తి 21 రోజుల పాటు కేతార గౌరి వ్రతం చేసి ఇదే రోజున ముగించిందని, ఈ వ్రతానికి తర్వాత శివుడు తన శరీరంలో సగభాగాన్ని ఈశ్వరికి ఇచ్చి అర్థనారీశ్వరుడిగా పేరు పొందాడని కలదు.