బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (11:27 IST)

ప్రోటీన్ స్నాక్స్.. కోడిగుడ్డుతో 65 ఎలా చేయాలి

How to make egg 65 recipe
How to make egg 65 recipe
పిల్లలకు రోజూ ఓ కోడిగుడ్డును ఆహారంగా ఇవ్వడం మంచిది. మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఎంతో మేలు చేస్తుంది. కోడిగుడ్లు ప్రోటీన్లకు సరైన ఆహారం. బరువు తగ్గాలనుకునే వారికి గుడ్లు తినడం మంచిది. గుడ్డు సొనలో విటమిన్ డి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోజూ ఓ కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాంటి కోడిగుడ్డుతో ఆమ్లెట్, కూర వంటివి కాకుండా 65 చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు. అదెలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు
గుడ్డు - 6,
పెరుగు - 1/2 కప్పు,
మైదా పిండి ​​- 1 టేబుల్‌స్పూను,
మొక్కజొన్న పిండి - 1 టేబుల్ స్పూన్,
మిరియాల పొడి - 1 1/2 స్పూన్,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్,
నిమ్మరసం - 1 చెంచా,
ఉప్పు - కావలసినంత, 
నూనె - అవసరమైనంత.
 
తయారీ విధానం:
ముందుగా కోడి గుడ్లలో ఉప్పు వేసి బాగా గిల కొట్టండి. వెడల్పాటి బాణలిలో నీళ్లు పోసి చిన్న పాన్ మధ్యలో వుంచి బాగా గిల కొట్టిన గుడ్డుకు వుంచి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆపై పాన్ లోని ఉడికించిన కోడిగుడ్డును తీసి చల్లారనివ్వాలి. ఆపై ఉడికిన కోడిగుడ్లను వేరు చేసి కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ముందుగా వెడల్పాటి బాణలిలో మైదా పిండి, మొక్కజొన్న పిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. దీనికి తరిగిన కోడిగుడ్డు ముక్కలను వేసి బాగా కలిపి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత బాణలిలో నూనె పోసి అది వేడయ్యాక గుడ్డు ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి వేడి వేడిగా సాస్‌తో సర్వ్ చేయాలి.