శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (15:16 IST)

రొయ్యల పకోడీలు తయారీ విధానం...

రొయ్యల్లో ప్రొటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. తరచుగా డైట్‌లో రొయ్యలకు తీసుకుంటే కావలసిన బలం చేకూరుతుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులతో పాటు మెదడు, నరాల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చ

రొయ్యల్లో ప్రొటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. తరచుగా డైట్‌లో రొయ్యలకు తీసుకుంటే కావలసిన బలం చేకూరుతుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులతో పాటు మెదడు, నరాల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువ. రొయ్యలు తినడం వలన థైరాయిడ్ సమస్యలు తొలగిపోతాయి. మరి ఇటువంటి రొయ్యలతో పకోడీలు ఎలా చేయాలా చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
రొయ్యలు - పావుకిలో
ఉప్పు - 2 స్పూన్స్
శెనగపిండి - 1 కప్పు
వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పసుపు - 1/2 స్పూన్
ఎర్రకారం - 1/2 స్పూన్
పచ్చిమిర్చిముక్కలు - 1 స్పూన్
కొత్తిమీర తరుగు - 1 స్పూన్
ఆమ్చూర్ - 1 స్పూన్
నీళ్లు - 2 కప్పులు
నూనె - వేయించడానికి సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా రొయ్యలను బాగా కడుక్కుని నీళ్లు లేకుండా వార్చేసుకోవాలి. ఇప్పుడు శెనగపిండి, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఎండుకారం ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లను పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడిచేసుకోవాలి. ఆ పిండిలో రొయ్యలను ముంచి సన్నని మంటపై నూనెలో వేసి లేత బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేగించుకుని ప్లేట్‌లో వేసుకోవాలి. అంతే రొయ్యల పకోడీలు రెడీ.