శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (13:38 IST)

ఆలూ పరోటా తయారీ విధానం.....

బంగాళాదుంపల్లో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. బంగాళా దుంపలు ఎక్కువ క్యాలరీలను అధికంగా అందిస్తాయి. కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బంగళాదుంపల్లో పీచు పుష్కలంగా

బంగాళాదుంపల్లో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. బంగాళా దుంపలు ఎక్కువ క్యాలరీలను అధికంగా అందిస్తాయి. కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బంగళాదుంపల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. మధుమేహం, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నవారు దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇటువంటి ఆలూతో పరోటా ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు: 
గోధుమ పిండి - అర కేజీ 
మైదా పిండి - అరకేజీ 
బంగాళదుంపలు - అరకేజీ
ఉల్లిపాయలు - 2 
పచ్చిమిరపకాయలు - 4
క్యారెట్‌ - 2 
అల్లం, వెల్లుల్లి ముద్ద - 2 స్పూన్స్ 
పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పసుపు - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో గోధుమపిండి, మైదాపిండిని చపాతీ పిండిలా కలుపుకుని అరగంట పాటు నానబెట్టాలి. కుక్కర్‌లో బంగాళదుంపలను ఉడికించుకోవాలి. బాణలిలో నూనెను వేసి కాగిన తరువాత పోపుదినుసులు వేసి ఆ మిశ్రమంలో ఉల్లిపాయ. మిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఈ ముక్కలు వేగిన తరువాత అల్లం, వెల్లుల్లి ముద్ద, క్యారెట్‌, పుదీనా, కొత్తిమీర వేసి అందులో బంగాళదుంప ముద్దనువేసి బాగా కలుపుకుని దించేయాలి. 
 
ఈ ముద్ద చల్లారిన తరువాత చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిలా కలిపి పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా చిన్నగా వత్తుకోవాలి. అలా వత్తుకున్న పూరీల మధ్యలో ఆలూ ముద్దను ఉంచి కూర బయటకు రాకుండా మడిచి చుట్టూ వత్తుకోవాలి. తరువాత వీటిని పెనంపై కాల్చుకుంటే ఆలూ పరోటా రెడీ.