శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By PNR
Last Updated : బుధవారం, 18 జూన్ 2014 (14:28 IST)

మానసిక సమస్యలు దూరం చేసే గంటల శబ్దం!

సాధారణంగా అలయాల్లో అమర్చే పెద్ద గంటల ప్రాధాన్యతను కూడా పెంగ్‌షుయ్‌ వివరిస్తోంది. గంటలను ఉపయోగించడంవల్ల మానసిక సమస్యలు దూరమవుతామని, కెరీర్‌లో అభివృద్ధి చెందుతామని పెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. ప్రతి రోజు పూజ చేసిన తర్వాత గంటలను మోగించాలని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించినట్లైతే ఆ రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు తగిన శక్తినిస్తుందని పెంగ్‌షుయ్ చెపుతోంది. గంటలను మోగించడంలో కూడా ఒక క్రమ పద్ధతి ఉందని, వరుసగా నాలుగైదు సార్లు గంటను మోగించరాదని పెంగ్‌షుయ్ చెబుతోంది. 
 
గంటను మోగించిన తర్వాత వాటి నుండి వెలువడు శబ్దాన్ని కాసేపు కళ్ళు మూసుకుని శ్రద్ధగా ఆలకించాలని చెపుతోంది. అనంతరం గంటకు కట్టిన దండాన్ని దగ్గరకు తీసుకురావాలని, శబ్దం వస్తున్న సమయంలోనే గంటకు దండాన్ని తాకనివ్వాలని వెల్లడిస్తోంది. ఇలా తాకనివ్వడంవల్ల గంట నుంచి వచ్చే ప్రతి ధ్వని దాదాపు ఓం శబ్దంలాగే వింటుందని, ఈ శబ్దం వింటూ మీరు ధ్యానంలోకి నిమగ్నులవుతారని పెంగ్‌షుయ్ తెలుపుతోంది. ఒక నిమిషం పాటు ఆనంద పరవశంలో తేలిపోతుంటారని, ఏదో తెలియని అద్భుత శక్తి మీ మనస్సులో ప్రవేశిస్తుందని పెంగ్‌షుయ్ శాస్త్రం పేర్కొంటోంది.