ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం ఆహారం ఎలా తీసుకోవాలి?
చైనీయుల వాస్తు శాస్త్రమైన ఫెంగ్‌షుయ్ ప్రకారం మిత ఆహారం తీసుకోవాలని, మాంసాహారం ఎక్కువగా తీసుకోరాదని చెపుతోంది. ముఖ్యంగా.. ప్రతి వ్యక్తి తీసుకునే ఆహారంలో కేవలం 80 శాతం మాత్రమే ఆహారంగా తీసుకోవాలని చెపుతోంది. 20 శాతం మేరకు కడుపు ఖాళీగా ఉంచినట్టయితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెపుతోంది.
ఈ 80 శాతం ఆహారంలో కూడా 40 శాతం సాధారణ ఆహారం, 20 శాతం మేరకు కూరగాయలు తప్పనిసరిగా తినాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. మరో 20 శాతం మజ్జిగ వంటి ద్రవరూప ఆహారాన్ని తీసుకోవాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఇకపోతే 15 నుంచి 20 వరకు ఖాళీ కడుపుతో ఉండటం మాంసాహారం భుజించే వారికి తప్పనిసరి అని వారు సూచిస్తున్నారు.
ఎందుకంటే మాంసాహారాన్ని రుచిగా ఉందని కొందరు భోజన ప్రియులు తెగ లాగించేస్తుంటారు. ఇలాంటి వారిని ఫెంగ్‌షుయ్ హెచ్చరిస్తోంది. రుచిగా ఉందని ఎక్కువగా తినేయకండి... అలా తినడానికి కూడా ఒక ఫెంగ్‌షుయ్ పద్ధతి ఉందని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు అంటున్నారు.