ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (09:36 IST)

శ్రీకృష్ణ జన్మాష్టమి పూజలో ఏయే వస్తువులను తప్పనిసరిగా ఉంచాలి?

srikrishna
వైదిక కాలమానం ప్రకారం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ కృష్ణుడు జన్మించాడని విశ్వాసం. దీంతో ఈ రోజున శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజిస్తారు. జన్మాష్టమి రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం ద్వారా కన్నయ్య ప్రసన్నుడై భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి కన్నయ్యను ప్రసన్న చేసుకునేందుకు చేసే పూజలో ఏ వస్తువులు ఉంచాలో తెలుసుకుందాం. 
 
శ్రీ కృష్ణుని విగ్రహం లేదా చిత్రం : పూజలో ప్రధాన భాగం శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రం. చిన్న లేదా పెద్ద విగ్రహం లేదా చిత్రాన్ని ఎంచుకోవచ్చు. 
పూలు - దండలు : శ్రీకృష్ణుడు తాజా పూల దండలతో అలంకరించండి. తులసి దళాలు, మల్లె లేదా ఇతర సువాసనగల పువ్వులను ఉపయోగించవచ్చు.
ధూపం - దీపం : ధూపం, దీపం వెలిగించడం ద్వారా పర్యావరణం శుద్ధి అవుతుంది. నెయ్యి దీపం లేదా అగరుబత్తీలు వెలిగించవచ్చు.
పండ్లు - స్వీట్లు : వివిధ రకాల పండ్లు, స్వీట్లను శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు. వెన్న, చక్కెర మిఠాయి, పాలకోవ, లడ్డూ మొదలైనవి శ్రీకృష్ణునికి ప్రీతికరమైనవి.
పంచామృతం : పంచామృతం అనేది పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరుతో చేసిన పవిత్ర మిశ్రమం. దీనిని శ్రీకృష్ణునికి సమర్పిస్తారు.
 
అలాగే, కృష్ణ జన్మాష్టమి రోజున దేవాలయాలు, గృహాలలో శ్రీకృష్ణుని పూజించండి. ఈ రోజున ఉపవాసం ఉండి అర్థరాత్రి శ్రీకృష్ణునికి ఆహారం సమర్పించండి. దేవాలయాలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భజనలు, కీర్తనలు, నాటకాలు ఉంటాయి. శ్రీకృష్ణుని విగ్రహాలను పూలమాలలతో అలంకరించండి. కృష్ణ భగవానుడికి వెన్న, పంచదార మిఠాయి, పండ్లు వంటి కన్నయ్యకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించండి.