సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2024 (13:18 IST)

పౌర్ణమి రోజున ఇలా చేస్తే అప్పులు తీరిపోతాయి.. తెలుసా?

Lakshmi Puja
పౌర్ణమి రోజున ఇలా చేస్తే అప్పులు తీరిపోతాయి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సాధారణంగా ప్రతిరోజు చేసే పూజల కంటే అన్ని మాసాల్లో వచ్చే పౌర్ణమి, అమావాస్య వంటి విశేష రోజుల్లో చేసే పూజలకు ఎక్కువ శక్తి వుంటుంది.
 
అది కూడా ప్రత్యేకంగా పౌర్ణమి రోజున గిరి ప్రదక్షణ చేయడం, దీపారాధన చేయడం, పూజలు చేయడం ద్వారా సుభిక్షం చేకూరుతుంది. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. కాబట్టి, పౌర్ణమి రోజున వ్రతం చేయడం వల్ల అన్ని రకాల సంపదలు లభిస్తాయి. ప్రతి పౌర్ణమి వ్రతాన్ని ఆచరించడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
ప్రత్యేకించి, పౌర్ణమి రోజున వ్రతం ద్వారా తీరని అప్పుల సమస్య తీరుతుంది. సంపదను పెంచుతుంది. వివాహ యోగం లభిస్తుంది. పౌర్ణమి రోజున మహా త్రిపురసుందరిని పూజించాలి. పౌర్ణమి రోజున అంబికను పూజించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
ఈమెతో నేతితో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల సర్వ శుభాలు చేకూరుతాయి.