మంగళవారం, 19 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (10:40 IST)

పూర్వం రోజుల్లో హోలీ పండుగ ఎలా చేశావారంటే..?

ప్రతీ ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్టు హిందూ పురాణంలో చెప్పబడుతోంది. హోలీ అంటే.. అగ్ని, అగ్నిచే పునీతమైనదని పండితులు చెప్తున్నారు. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను రంగుల పండుగ, హోలీ, కాముని పున్నమిగా దేశ వ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు.
 
పూర్వం రోజుల్లో ఈ హోలీ పండుగ నాడు రకరకాల పువ్వులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ వారి సంతోషాన్ని పంచుకునోవారు. కాని ఇప్పటి కాలంలో పువ్వుల స్థానంలో రకరకాల రంగులు వచ్చిచేరాయి. ఈ రంగులను నీళ్లల్లో కలిపి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఇలా చల్లుకోవడం వలన ప్రేమతో పాటు సౌభాగ్యాలు కూడా వెల్లి విరుస్తాయని అందరూ భావిస్తారు. 
 
వంగ దేశంలో డోలోత్సవాన్ని జరుపుకుంటారు. శ్రీకృష్ణునితో కలిసి గోపికలు ఆనాడు బృందావనంలో పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్టుగా భావించి హోళి పండుగ రోజున శ్రీకృష్ణుని రాధను ఊయాలలో పెట్టి డోలోత్సావాన్ని చేస్తారు.