మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 అక్టోబరు 2021 (23:09 IST)

ప్రకటనలలో మహిళల చిత్రణ పై జెండర్‌ నెక్ట్స్‌ నివేదికను విడుదల చేసిన ఆస్కీ-ఫ్యూచర్‌ బ్రాండ్స్‌

బ్రాండ్లు మరియు ఎడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలు లింగ (జెండర్‌) కథనాలను సానుకూల మార్గంలో వెల్లడించేందుకు సహాయపడుతూ, ద ఎడ్వర్టయిజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) మరియు ఫ్యూచర్‌ బ్రాండ్స్‌ తమ జెండర్‌ నెక్ట్స్‌ స్టడీని విడుదల చేశాయి. ఎడ్వర్టయిజింగ్‌లో మహిళా ప్రాతినిధ్యంపై సమగ్రమైన కార్యాచరణ అంతర్దృష్టి అధ్యయనం ఇది.
 
 
బహుళ విభాగాలైనటువంటి వ్యక్తిగత సంరక్షణ, ఫ్యాషన్‌, బ్యూటీ, హోమ్‌ మరియు హీరాత్‌, గాడ్జెట్స్‌, వీల్స్‌, నగదు మరియు విద్య వ్యాప్తంగా ధోరణులను జెండర్‌నెక్ట్స్‌ వెల్లడిస్తుంది. ఈ అధ్యయనంలో ప్రకటనలలో మహిళలను ఏ విధంగా చూపుతున్నారు మరియు ఆ మహిళలు తమను తాము ఏ విధంగా ఆ ప్రకటనలలో చూడాలనుకుంటున్నారు లాంటి అంశాలను కూడా స్పృశించారు.
 
 
జెండర్‌ నెక్ట్స్‌ అధ్యయనంకు నేతృత్వం వహించడటంతో పాటుగా ముఖ్య రచయితగా వ్యవహరించిన లిపికా కుమరన్‌ వెల్లడించే దాని ప్రకారం, ప్రకటనలలో కొన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, ప్రధాన స్రవంతి   ప్రకటనలు అధికంగా వినియోగించబడిన మరియు కొన్ని సార్లు హానికరమైన మూస పద్ధతుల నుంచి స్ఫూర్తిని తీసుకుని తమ ప్రకటనలు రూపొందిస్తున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 600కు పైగా ప్రకటలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత పలు సమస్యాత్మక అంశాలను వెల్లడించింది. వాటిలో మహిళలు తినడాన్ని కూడా సున్నితంగా మలచడం; ఆర్ధిక పరమైన ప్రకటనలలో మహిళలను అధికంగా ఖర్చు చేసే వ్యక్తులుగా చూపడం; మహిళలు ఇంటి చుట్టూ పరుగుపెడుతుండగా, వారి చుట్టూ ఇతరులు తిరుగుతుండటం; బ్యూటీ ప్రకటనలలో  పురుషుల అంగీకారం తెలుపుతున్నట్లుగా చూపడం, గాడ్జెట్‌ ప్రకటనలలో  సాంకేతికత పరంగా మహిళలకు ఏమీ తెలియదన్నట్లుగా చూపడం,  మేల్‌ సెలబ్రిటీలు సవాళ్లు విసురుతూ మహిళలకు సూచనలు అందించడం వంటివి ఉన్నాయి.
 
 
విభిన్న వయసుల మహిళలను, విభిన్న పట్టణాలలో  ఇంటర్వ్యూ చేసిన పిమ్మట వారు చెబుతున్నదేమిటంటే, తాము ఆ తరహా  మహిళలం కాదని, తమలా ప్రవర్తిస్తూ అన్ని రంగాల్లోనూ వెనుబడిన వ్యక్తులు వారంటూ వెల్లడించారు. సాధికారితను తాము కోరుకుంటున్నామన్నారు. ఈ ప్రయాణంలో ప్రకటనలు తమకు సహచరులుగా నిలుస్తాయనీ వెల్లడిస్తున్నారు. ఈ అధ్యయనంలో కనుగొన్న దాని ప్రకారం, అవివాహిత మహిళలను, ఈ ప్రకటనలలో మూస పద్ధతిలో తమ సంతోషం కోసం పనిచేయడమే కానీ, ఎలాంటి లక్ష్యాలు లేకుండా వారు ముందుకు సాగుతుంటారని చూపిస్తుంటారు. గణనీయమైన పోరాటం తరువాత మాత్రమే మహిళలు విజేతలుగా నిలుస్తారని వెల్లడించే సాధారణ మహిళా దినోత్సవ ప్రకటలను ప్రత్యేకించి సాధికారితగా పరిగణించబడటం లేదు. పోరాటం చేసిన తరువాత మాత్రమే యువతకులకు స్వేచ్ఛ ప్రసాదిస్తున్నట్లుగా చూపిస్తున్న ప్రకటనలతో మహిళలు అలిసిపోయారు.
 
 
ఈ అధ్యయనంలో ఓ అజ్ఞేయవాద ముసాయిదా ద సీ (సెల్ఫ్‌(స్వీయ)ఎస్టీమ్డ్‌ (గౌరవనీయమైన) ఎంపవర్డ్‌(సాధికారిత) అలైడ్‌ (సంబంధిత) ) ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదిస్తుంది. ఇది కల్పనాశక్తిని  నిర్మించడం మరియు మూల్యాంకనం  చేయడం ద్వారా వారి ప్రకటనలలో మహిళల ను ఏ విధంగా చూపాలనే అంశంపై వాటాదారులకు మార్గనిర్దేశనం చేయడం లక్ష్యంగా చేసుకుంది.
 
ఈ అధ్యయనం, ఇప్పుడు 3ఎస్‌ స్ర్కీనర్‌ను స్ర్కిప్ట్స్‌/స్టోరీబోర్డ్స్‌, కాస్టింగ్‌, స్టైలింగ్‌ నుంచి మూస ధోరణులు గుర్తించి అడ్డుకోవడం గురించిన ప్రక్రియలను సైతం వెల్లడించింది.  ఈ స్ర్కీనర్‌ మూడు అంశాలు 1) సబార్డినేషన్‌ 2) సర్వీస్‌ మరియు 3) స్టాండర్డజేషన్‌ చూస్తాయి.
 
 
సుభాష్‌ కామత్‌, ఛైర్మన్‌, ఆస్కీ మాట్లాడుతూ ‘‘వాటాదారులు- బ్రాండ్‌ యజమానులు మార్కెటీర్లు, అడ్వర్టయిజింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం మార్గదర్శకునిగా జెండర్‌నెక్ట్స్‌ తోడ్పడటంతో పాటుగా ప్రకటనలలో మహిళలను ప్రగతిశీలంగా చూపే రీతిలో  పాత్రలను సృష్టించడంలో తోడ్పడుతుంది. మహిళల లోతైన విషయపరిజ్ఞానం మరియు ప్రకటనల పట్ల వారి అభిప్రాయాలు తెలుపడమన్నది ప్రకటనల సృష్టిలో అద్భుతంగా తోడ్పడుతుంది. ఈ అధ్యయనంలో కనుగొనబడిన అంశాలతో బ్రాండ్లతో పాటుగా ప్రకటనకర్తలు మరింతగా స్ఫూర్తినొందడంతో పాటుగా మహిళలను మరింతగా ప్రగతిశీల మార్గాలలో చూపగలరని ఆశిస్తున్నాము. ప్రమాదకర   మూసధోరణులకు సంబంధించి ప్రకటనల మార్గదర్శకాలను సమీక్షించేందుకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను సైతం ఏర్పాటుచేయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని అన్నారు.
 
 
సంతోష్‌ దేశాయ్‌, ఎండీ, ఫ్యూచర్‌ బ్రాండ్స్‌ కన్సల్టింగ్‌ మాట్లాడుతూ ‘‘ ప్రాచుర్యం పొందిన సంస్కృతిపై ప్రభావం చూపే మాధ్యమంగా ప్రకటనలకు చారిత్రాత్మకంగా ప్రాధాన్యత ఉండటంతో పాటుగా లింగ పరంగా మూసధోరణులను ప్రచారం చేయడంలోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయి. చాలా అంశాలు మారుతున్న వేళ, ఆస్కీ ప్రారంభించగా, ఫ్యూచర్‌ బ్రాండ్స్‌ నిర్వహించిన ఈ అధ్యయనంలో  లింగ పరంగా వివక్షత కొనసాగుతుందని వెల్లడైంది. కొన్ని మూస ధోరణులు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, ఇతర మార్గాలలో అవి కనిపిస్తూనే ఉన్నాయి. వీటిలో సూక్ష్మ మైన,సూక్ష్మం కాని  అంశాలు సైతం ఉండటంతో పాటుగా లింగ పరంగా వివక్షతను చూపుతూనే ఉన్నారు. ఈ  జెండర్‌ నెక్ట్స్‌ అధ్యయనం ద్వారా వివక్షతకు సంబంధించి కొన్ని సాధారణ పద్ధతులను కనుగొనడం జరిగింది మరియు మార్కెటీర్లు ఆ తరహా అవాంఛనీయ ప్రాతినిధ్యంలను గుర్తించి, తొలగించేందుకు ఓ కార్యాచరణను సైతం సృష్టించింది’’ అని అన్నారు.
 
 
మనీషా కపూర్‌, సెక్రటరీ జనరల్‌-ఆస్కీ మాట్లాడుతూ ‘‘ఈ విభాగంలో ఆస్కీ చేస్తున్న ఎన్నో  కార్యక్రమాలలో మొదటిది ఈ నివేదిక. ఈ చర్చ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’’అని అన్నారు. ఈ అధ్యయనానికి రియో ప్యాడ్స్‌ స్పాన్సర్‌ చేసింది. వీరు ముఖ్య స్పాన్సర్‌గా వ్యవహరిస్తే, కో–స్పాన్సరర్లుగా వివెల్‌, యూరేకా ఫోర్బ్స్‌ లిమిటెడ్‌, కెల్లాగ్స్‌, కోల్గేట్‌ పామోలివ్‌, డియాగో ఇండియా, మాండెలెజ్‌ ఇండియా ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరియు ప్రొక్టర్‌అండ్‌ గాంబెల్‌ హోమ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవహరిస్తున్నాయి. అదే సమయంలో కొటక్‌ సిల్క్‌ మరియు మహీంద్రా  అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌లు అసోసియేట్‌ స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నాయి.
 
కార్తీక్‌ జోహారీ, వీపీ-మార్కెటింగ్‌ అండ్‌ కామర్స్‌, నోబెల్‌ హైజీన్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌ (రియో ప్యాడ్స్‌ రూపకర్తలు) మాట్లాడుతూ, ‘‘ మాతృత్వం, స్త్రీత్వం గురించి మన సంస్కృతి కోణంలో ఈ సెమినియల్‌ అధ్యయనంలో పాలుపంచుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. సాంస్కృతిక సంభాషణలు మరియు మార్పుపై ప్రభావం చూపడంలో ప్రకటనలకు బాధ్యత ఉంది. ఈ అధ్యయనంతో, మేము మార్పుకు తగిన  మార్గదర్శకాలను సృష్టించగలమని ఆశిస్తున్నాము. వీటిని ప్రకటనకర్తలు స్వయం చాలకంగా వినియోగించడంతో పాటుగా తమ కమ్యూనికేషన్స్‌ వ్యాప్తంగా మహిళల ప్రాతినిధ్య పరంగా వాటిని వినియోగించుకోగలరు. తద్వారా దేశవ్యాప్తంగా సమానత్వం మరియు మానవత్వంపై చర్చనూ ఆరంభించగలరు’’ అని అన్నారు.
 
ఈ అధ్యయనం కోసం, ప్రాధమిక పరిశోధనలో యాడ్‌ క్లీనిక్స్‌ కూడా భాగమయ్యాయి. దాదాపు 160 మంది స్పందనదారులు, 20కు పైగా ఫోకస్‌ గ్రూప్‌ చర్చలు 10 కేంద్రాల వ్యాప్తంగా జరిగాయి. వీటితో పాటుగా ఫ్యూచర్‌ బ్రాండ్‌ యొక్క ప్రొప్రైయిటరీ అధ్యయనం భారత్‌ దర్శన్‌ సైతం వినియోగించారు.  సామాజిక మాధ్యమాల ద్వారా 300కు పైగా ప్రజలతో మాట్లాడారు. ప్రాంతీయ  మరియు జాతీయ  ప్రకటన కర్తలు, ఏజెన్సీ మరియు క్రియేటివ్‌ హెడ్స్‌, జెండర్‌ డొమైన్‌ నిపుణులు, విధాన నిర్ణేతలు మరియు ఎడ్వొకసీ గ్రూపులును సైతం ఈ అధ్యయనంలో భాగంగా ప్రశ్నించడం జరిగింది.