సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 21 జూన్ 2022 (23:05 IST)

హృద్రోగులు కూడా యోగా చేయవచ్చా?

Yoga
యోగా అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేదే. ఐతే కొంతమంది కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కలిగినవారు యోగా చేయరాదు. ఒక వ్యక్తికి ఇటీవల గుండెపోటు వచ్చినట్లయితే, అతను 3-4 వారాల పాటు యోగా చేయకూడదు.


కానీ ఈ సమయం తరువాత, గుండె రోగులు కూడా యోగా చేయవచ్చు. ఐతే ఇలా గుండెపోటు వచ్చినవారు యోగా ప్రారంభించే ముందు ఖచ్చితంగా తన వైద్యుడిని అడగాలి. ఎందుకంటే వ్యక్తి యొక్క గుండె పంపింగ్ రేటు నెమ్మదిగా ఉంటే, యోగా అతనికి సమస్యలను కలిగిస్తుంది. అయితే, అలాంటి వారు ధ్యానం చేయవచ్చు.

 
ఏ యోగాసనాలు గుండెకు మేలు చేస్తాయి?
యోగాసనాలన్నీ గుండెకు మేలు చేస్తాయి. అందుకే ఆరోగ్యంగా ఉన్నా గుండె జబ్బులు రాకుండా ఉండాలనుకునే వారు ఏదైనా యోగాసనం వేయవచ్చు. కానీ గుండె జబ్బు ఉన్నవారు కపాలభవి చేయకూడదు. అనులోమ్-విలోమ్, ప్రాణాయామం, సూర్య నమస్కారం, వృక్షాసన, తాడాసన, ధనురాసన, పశ్చిమోత్తాసన, శవాసన వంటివి చేయవచ్చు. కానీ గుండె జబ్బులు వున్నవారు మాత్రం యోగా చేయాలనుకున్నప్పుడు ఒకసారి మీ వైద్యుడిని సంప్రదించాలి.