శుక్రవారం, 19 జులై 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: గురువారం, 20 జులై 2023 (13:00 IST)

పింక్ ఐ- కండ్ల కలక లక్షణాలు, చికిత్స ఏమిటి?

Pink Eye
కండ్ల కలక. దీనినే పింక్ ఐ అని కూడా అంటారు. వర్షా కాలం రాగానే ఈ అంటువ్యాధి ప్రబలుతుంది. కళ్లు ఎర్రబారిపోతాయి. కండ్ల కలక లక్షణాలు, చికిత్స ఏమిటో తెలుసుకుందాము. కండ్ల కలక వస్తే కళ్లు ఎర్రబారి కళ్లలో నుంచి నీళ్లు కారుతుంది, కంటి రెప్పలు ఉబ్బుతాయి. రాత్రి నిద్రపోయినపుడు తెల్లారేసరికి రెప్పలు అతుక్కునిపోతాయి.
 
కండ్ల కలక సమస్యకి మందులు వాడకపోయినా కొందరికి తగ్గిపోతుంది. కండ్ల కలక తలెత్తినప్పుడు కంటి సమస్యలు రాకుండా యాంటీబయోటిక్ కంటి చుక్కలు వాడాలి. కంటిని తరచుగా నీళ్లతో కడుక్కుంటుండాలి, ఇలా చేస్తుంటే కండ్ల కలక త్వరగా తగ్గుతుంది. కండ్ల కలక అంటువ్యాధి కనుక ఈ సమస్య వచ్చినవారికి దూరంగా వుండాలి, వాళ్లు వాడిన వస్తువులు వాడకూడదు.