బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (22:02 IST)

కార్డియాక్ అరెస్ట్- గుండెపోటు సంకేతాలు ముందే హెచ్చరిస్తాయి, అవేంటి?

Heart
కార్డియాక్ అరెస్ట్- గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. కార్డియాక్ అరెస్ట్ ప్రధానంగా 3 సంకేతాలు కనబడుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఈ గుండెపోటును ఎలా నిరోధించవచ్చో కూడా తెలుసుకుందాము. గుండెపోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు, గుండె ఆగిపోవడానికి ముందుగానే కొన్ని లక్షణాలు కనబడతాయి.శ్వాస ఆడకపోవడం కనబడుతుంది. ఇది పురుషుల కంటే స్త్రీలలో చాలా సాధారణంగా కనిపిస్తుంది.
 
విపరీతమైన అలసటగా వుంటుంది. ఇది అసాధారణ అలసటగా కనిపిస్తుంది. వెన్నునొప్పి కనిపిస్తుంది. ఫ్లూ వంటి లక్షణాలు కూడా అగుపిస్తాయి. కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటివి వుంటాయి. ఛాతీ నొప్పిగా అనిపిస్తుంది. ఇది మహిళల కంటే పురుషులలో సర్వసాధారణంగా వుంటుంది.
 
కార్డియాక్ అరెస్ట్‌ను నిరోధించేందుకు చురుకుగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. గుండె, రక్త నాళాలు మంచి స్థితిలో ఉంచడం ద్వారా రక్తపోటును తగ్గిస్తూ గుండె ఆరోగ్యంగా వుంచవచ్చు. నడక, ఈత, సైక్లింగ్ వంటి కార్యకలాపాలు చేస్తుంటే గుండెపోటు సమస్య రాకుండా చూసుకోవచ్చు.