శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (18:25 IST)

బాస్కెట్ బాల్ ఆడుతుండగా గుండెపోటు: అమెరికా యువకుడు మృతి

Basket Ball
Basket Ball
అమెరికా యువకుడు బాస్కెట్ బాల్ ఆడుతుండగా గుండెపోటు వచ్చింది. నార్త్ వెస్ట్రన్ హైస్కూలుకు చెందిన 18 ఏళ్ల కార్టియర్ వుడ్స్ వున్నట్టుండి బాస్కెట్ బాల్ ఆడుతూ జనవరి 31న మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
ఆ రోజు నుంచి హెన్రీ ఫోర్డ్ ఆస్పత్రిలో లైఫ్ సపోర్టులో వున్నాడు. అతడు డగ్లస్ హైస్కూలుతో జరిగిన మ్యాచ్ లో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. 
 
అయితే ఎందరూ ప్రార్థించినా.. వైద్యులు ఎంత ప్రయత్నించినా అతని ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. విద్యార్థి ఇలా 18 ఏళ్లకే గుండెపోటుతో ప్రాణాలు పోగొట్టుకోవడం ద్వారా అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.