మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By జె
Last Modified: గురువారం, 9 సెప్టెంబరు 2021 (20:19 IST)

నోటి దుర్వాసన నివారణకు సరైన మార్గం, ఏం చేయాలంటే?

మంచి-చెడు సూక్ష్మక్రిములు వృద్ధి చెందే ప్రాంతం దంతాలు. శుభ్రంగా బ్రెష్ చేసినా అప్పుడప్పుడు వాసన వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆ వాసన వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి.
 
దంతాలలో పాటించే పరిశుభ్రత అలవాట్ల వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఈ దుర్భలత్వం కొన్ని వైద్య పరిస్థితులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆహారాల వల్ల తీవ్రతరం కావచ్చు. అనారోగ్యకరమైన నోటి అపరిశుభ్రత దంతాల మధ్య, చిగుళ్ళ చుట్టూ సూక్ష్మక్రిములు పెరగడానికి కారణమవుతుంది.
 
ఇది నోటి దుర్వాసనకు కారణమవుతుంది. చిగుళ్ళ సంబంధిత సమస్యల వల్ల కూడా నిరంతరం దుర్వాసన వస్తుంది. ఖచ్చితంగా రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం అలవాటుగా చేసుకోవాలి. నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళి దంతాలను తనిఖీ చేయించుకోవాలి.
 
ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలి. చక్కెర, ఆమ్ల పానీయాలు మానుకోవాలి. ప్రతిరోజు మౌత్ వాష్ ఉపయోగించాలి. నాలుకను శుభ్రం చేసుకోవాలి. ధూమపానం పూర్తిగా వదిలేయాలి. పుష్కలంగా మంచినీరు తాగాలి.