మధుమేహాన్ని పట్టించే జస్ట్ మూడంటే మూడు సంకేతాలు
మధుమేహం లేదా షుగర్ వ్యాధి. ఈ మధుమేహం కూడా గమనించవలసిన సంకేతాలు, లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు సాధారణంగా అనిపిస్తాయి. కానీ మెల్లగా తీవ్రరూపం దాల్చుతాయి. చేతులు, కాళ్ళలో జలదరింపుగా తరచూ అనిపిస్తుంటే అది శరీరంలోని రక్తంలో చక్కెర పెరుగుదలకు సంకేతం.
ప్రపంచంలో మధుమేహం ఉన్న ఆరుగురిలో ఒకరు భారతదేశానికి చెందినవారుగా వున్నారంటే ఈ వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. భారతదేశం దాదాపు 8 కోట్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు నిలయంగా ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఇండియా తర్వాత చైనా రెండో స్థానంలో వుంది. జన్యుపరమైన వంశపారంపర్య కారకాలు, స్థిరంగా కూర్చుని పనిచేసే జీవనశైలి వంటివి ఈ వ్యాధి కారకాలుగా వుంటుంటాయి.
మధుమేహం మూడు సంకేతాలు
తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం: అర్ధరాత్రి వాష్‌రూమ్‌ను ఉపయోగించాలని అనిపిస్తే, చాలా తరచుగా అది చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు సంకేతం. తియ్యటి ఆహారాన్ని తీసుకున్న తర్వాత మూత్రవిసర్జన పెరుగుతుందని కూడా పరిగణించాలి.
దృష్టి సమస్య: రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల చూపు మందగించవచ్చు. కంటి చూపులో మార్పు కూడా రావచ్చు.
మలబద్ధకం: మలబద్ధకం సమస్య తలెత్తవచ్చు. ఈ మలబద్ధకం వెనుక ఉన్న కారణం ఏమిటంటే, అధిక స్థాయి గ్లూకోజ్ పేగులోని నరాలను దెబ్బతీస్తుంది. ఇది కొన్ని నెలల్లో మరిన్నిసార్లు తలెత్తవచ్చు. డయాబెటీస్ నిర్ధారణ చేయడానికి ఏకైక మార్గం వైద్యులను సంప్రదించడం లేదంటే సాధారణ రక్త పరీక్ష చేయించుకోవడం.