గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 27 నవంబరు 2023 (22:24 IST)

చలికాలంలో నెయ్యి తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి?

ghee
నెయ్యి. ఏ పదార్థంతోనైనా ప్రయోజనాలు, నష్టాలు రెండూ వుంటాయి. ఐతే కొన్ని సీజన్లలో కొన్నింటిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే కొన్ని నష్టాలు ఏమిటో తెలుసుకుందాము. శీతాకాలంలో నెయ్యి ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం, విరేచనాలయ్యే సమస్యలు వస్తాయి.
 
జలుబు, దగ్గుతో బాధపడుతుంటే నెయ్యికి దూరంగా ఉండాలి. నెయ్యి తీసుకోవడం వల్ల కఫం ఏర్పడి దగ్గు పెరుగుతుంది. చలికాలంలో నెయ్యి ఎక్కువగా తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శీతాకాలంలో నెయ్యి తింటే కాలేయ సమస్యలు కూడా రావచ్చు. చలికాలంలో నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.