శనివారం, 18 ఏప్రియల్ 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chitra
Last Updated : శనివారం, 2 జనవరి 2016 (11:51 IST)

చలికాలంలో సైనసైటిస్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ప్రతి మనిషి తన జీవితకాలంలో సైనసైటిస్ బారిన పడకుండా ఉండరు. ఈ సైనసైటిస్ వ్యాధి ఇన్‌ఫెక్షన్స్ వల్ల వస్తుంది. ముక్కు భాగంలో అంతరాయం ఏర్పడటానికి, ముక్కులోని టర్బినేట్లు వ్యాకోకించడం గానీ, ముక్కు భాగంలోని సెప్టమ్‌లు పక్కకు జరగడం గానీ, సైనస్‌ భాగాల్లో గానీ, కణజాలంలో వాపు ఏర్పడటం గానీ, కారణం కావచ్చు. 
 
సైనసైటిస్‌ సమస్య వయోభేదం లేకుండా ఎవరికైనా రావచ్చు. కాకపోతే ఇది వర్షాకాలం, శీతలకాలంలోనే ఎక్కువగా వస్తుంది. అలర్జీ తత్వం ఉన్నవారిలోనూ, కాలుష్యాల మధ్య పనిచేసే వారిలోనూ ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. అయితే వ్యాధి ముదిరేదాకా చూడకుండా ముందే చికిత్స తీసుకోవడం వల్ల వ్యాధి నుంచి తొందరగా బయటపడవచ్చు. ఈ వ్యాధిని ముందే గుర్తించాలంటే, సైనసైటిస్‌ లక్షణాల గురించి తెలియాలి. ఆ లక్షణాల్లో ప్రధానంగా కనిపించేవి ఇవి..
 
అస్తమానం ముక్కునుండి నీరుకారం, తుమ్ములు రావడం, కోపం, చిరాకు, కళ్లలో నీరు కారడం, తలనొప్పి, ఒళ్లు వేడిగా ఉండటం, తల ముందుకు వంచితే బరువుగా అన్పించడం, ముక్కులోంచి కొన్ని ద్రవాలు గొంతులోకి జారడం, చెంపలు, నుదురు భాగాల్లో ఒత్తిడి అనిపించడం, ముఖం బరువుగా అనిపించడం, శ్వాస సరిగా ఆడక ముక్కు దిబ్బడ వేసినట్లు ఉండటం, కనుబొమ్మల మధ్య నొప్పి రావటం, ముక్కులో మంట దురదగా ఉండటం, తలనొప్పి, కళ్ల వద్ద నొప్పి అనిపించడం. వాసనలు తెలియకపోవడం, గొంతులో నొప్పిగా ఉన్నట్లు అనిపించటం.
 
దుమ్ము, ధూళి ఏ కొంచెం సోకినా, చల్లగాలిలో తిరిగినా చాలామందికి వెంటనే తుమ్ములు రావటం జలుబు చేయటం జరుగుతుంది. జలుబు అప్పుడప్పుడు చేయడం సహజం. అలా కాకుండా సంవత్సరం పొడవునా కాలంతో సంబంధం లేకుండా దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడేవారు ఎక్కువగా ‘సైనసైటీస్’కు గురికావడం జరుగుతుంది. శీతాకాలంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి లక్షణాలు సైనసైటిస్‌ను తెలియజేస్తాయి.
 
ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే ఇ.ఎన్‌.టి డాక్టర్‌ను కలవడం ఎంతో అవసరం. వైద్యుల దగ్గరకు వెళ్లటంవలన వ్యాధి తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడవచ్చును. శీతల పానీయాలు, చల్లటి పదార్థాలు తీసుకోకుండా తీసుకోవాలి. దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాలలోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాలి. ప్రతిరోజు వ్యాయామం, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజులు చేయడంవలన వ్యాధి తీవ్రత తగ్గుతుంది.