శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (12:02 IST)

తులసి ఆకుల పొడిని.. పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే?

తులసీ ఆకులతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తులసి ఆకుల రసాన్ని రెండు స్పూన్లు తాగితే జలుబు, దగ్గు మాయం అవుతుంది. ఊపిరితిత్తులు కూడా శుభ్రపడుతాయి. తులసీని ఔషధంగానూ సౌందర్య సాధనంగానూ ఉపయోగించుకోవచ్చు

తులసీ ఆకులతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తులసి ఆకుల రసాన్ని రెండు స్పూన్లు తాగితే జలుబు, దగ్గు మాయం అవుతుంది. ఊపిరితిత్తులు కూడా శుభ్రపడుతాయి. తులసీని ఔషధంగానూ సౌందర్య సాధనంగానూ ఉపయోగించుకోవచ్చు. తులసీ ఆకుల పొడిని పెరుగులో కలిపి ముఖానికి రాసుకుంటే.. చర్మం కాంతివంతంగా మారుతుంది. కళ్ళ కింద నలుపు తగ్గిపోతుంది. 
 
మొటిమలు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తులసి ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా వున్నాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్తపోటును దరిచేరనివ్వదు. తులసీ ఆకులు, తేనె, అల్లం కషాయాన్ని సేవించినట్లైతే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
తులసి ఆకులు నోటిలో కలిగే అల్సర్లను నయం చేస్తుంది. అందుకే రోజుకు రెండు తులసీ ఆకులను నమలాలి. తులసి ఆకులను నమలటం ద్వారా నోటి దుర్వాసన, దంత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.