మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్ కుమార్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:19 IST)

ఆపిల్ సిడార్ వెనిగర్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

సూర్యకాంతి వలన కలిగే చర్మ సమస్యలు ముఖ్యంగా వేసివికాలంలో చర్మ కణాలను ప్రమాదానికి గురి చేసి, చికాకులకు మరియు సమస్యలకు గురి చేస్తాయి. తరచుగా, ఎక్కువ సమయం ఎండలో ఉండటం వలన చర్మం కందిపోతుంది. ఈ రకమైన సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు రసాయనిక క్రీములతో చికిత్స చర్మాన్ని అలర్జీలకు గురిచేసి, సున్నితమైన చర్మాన్ని కలిగి ఉన్నవారిలో తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. 
 
అందువలన, ఇలాంటి ఖరీదైన చికిత్సలకు బదులుగా ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం ద్వారా సూర్యరశ్మి వలన కలిగే చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. సూర్యరశ్మికి బహిర్గతమైన సమయంలో, అతినీలలోహిత కిరణాల వలన చర్మం కణాలు ప్రమాదానికి గురవకుండా ఉండటానికి మెలనిన్ ఉత్పత్తి అధికం అవుతుంది. 
 
మెలనిన్ అనేది ఒక వర్ణద్రవ్యం, ఇది చర్మ, వెంట్రుకల మరియు కంటి రంగును నిలిపి ఉంచేలా చేస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో, మెలనిన్ సరిపోయేంత స్థాయిలో, వేగంగా ఉత్పత్తి చేయబడదు. ఫలితంగా చర్మంలోని జన్యుపదార్థం దెబ్బతింటుంది. 
 
ఫలితంగా ఆరోగ్యంగా ఉండే చర్మ కణాలు, అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదం నుండి ఉపశమనం పొందుటకు ఇన్ఫ్లమేషన్‌లకు గురవుతాయి. మరోవైపు, శరీరం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సార్లు ఈ రెండు పద్ధతుల మధ్య సమతుల్యత లేని ఎడల చర్మ క్యాన్సర్ కలిగే ప్రమాదం కూడా ఉంది. సూర్యకాంతిలో గడిపే సమయం మరియు మీ చర్మ ధోరణిపై ఆధారపడి చర్మం మంటకు గురవుతుంది.
 
సూర్యకాంతి వలన కందిన చర్మాన్ని ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం ద్వారా సరి చేయవచ్చు మరియు దీని వలన చర్మ కణాలలో కలిగిన ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. స్ప్రే బాటిల్‌లో కొద్దిగా వెనిగర్‌ను తీసుకొని, నీటిని కలపండి. ఈ ద్రావణాన్ని ప్రభావిత ప్రాంతాలలో స్ప్రే చేయండి.
 
శుభ్రమైన గుడ్డను వెనిగర్‌లో ముంచండి, ఈ గుడ్డతో చర్మంపై తుడవండి. డైల్యూటేడ్ ఆపిల్ సైడర్ వెనిగర్‌తో స్నానం చేయండి. ఇలా చేయటం వలన చర్మం కొద్ది సమయంలోనే తిరిగి తన సహజ కాంతిని పొందటం మీరు గమనిస్తారు.