సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: గురువారం, 3 జనవరి 2019 (19:43 IST)

సన్నబడాలంటే రోజుకి 3 కప్పులు ఈ కాయలు తింటే సరి.. ఎందుకంటే?

సన్నబడాలని ఆశపడేవారు చిక్కుడును ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి వందగ్రాముల చిక్కుడు కాయల్లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది.ముఖ్యంగా శరీరం బరువు తగ్గాలని డైటింగ్‌ చేసేవారు చిక్కుడును ఎక్కువగా తింటే మంచిది. అరకప్పు చిక్కుడులో 7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. చిక్కుడును కూరల్లోనే కాకుండా సూప్స్, ఇతర అల్పాహార తయారీలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో బీ-కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లు కూడా లభిస్తాయి. 
 
అంతేకాదు మన కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు వంటి భాగాలకు చిక్కుడు చక్కటి శక్తిని అందిస్తుంది.  అలాగే వరి అన్నం తీసుకునే షుగరు రోగులు అన్నంకన్నా చిక్కుడు శాతం ఎక్కువగా తీసుకుంటే 25 శాతం డయాబెటిస్‌ను నియంత్రించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. 
 
చిక్కుడును వారంలో కనీసం మూడుకప్పులు తినగలిగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలని పోషకాహార నిపుణులు తెలిపారు. చిక్కుడులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో తయారయ్యే క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. గుండెచుట్టూ కొలెస్టరాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ పెరగకుండా చూస్తాయి.