శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (13:07 IST)

తేనెను ఉదయం పూటే ఎందుకు తీసుకోవాలి?

తేనెతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మెదడుకు మేలు చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను నయం చేసుకోవచ్చు. ఇందులోని సహజ సిద్ధమైన యాంటీయాక్సిడెంట్లు మెదడును

తేనెతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మెదడుకు మేలు చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను నయం చేసుకోవచ్చు. ఇందులోని సహజ సిద్ధమైన యాంటీయాక్సిడెంట్లు మెదడును చురుగ్గా వుంచుతాయి. తేనె వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో తేనెను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజంతటికి కావలసిన శక్తినిస్తుంది. పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వారిలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 
 
అలాగే ప్రతిరోజూ తేనెను టీ, కాఫీల్లో కలుపుకుని తాగడం వల్ల ఆస్తమా వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. తేనె పంచదారకు అద్భుతమైన ప్రత్యామ్నయం. గోరువెచ్చని నీటితో కలిపి ప్రతీరోజూ తీసుకుంటే, రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఏడాది దాటిన పిల్లలకు రోజుకో స్పూన్ చొప్పున ఇస్తే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా జలుబు, దగ్గు వంటివి దూరమవుతాయి. 
 
తేనెను ఉదయం పూట పరగడుపున తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం పూట తీసుకోవడం ద్వారా ఆ రోజంతా హుషారుగా వుంచవచ్చునని.. అలాగే రాత్రిపూట నిద్రించే ముందు ఒక స్పూన్ తేనెను తీసుకుంటే.. హాయిగా నిద్రపడుతుందని.. మానసిక ఆహ్లాదం చేకూరుతుందని.. అజీర్ణ సమస్యలు తొలగిపోతాయని వైద్యులు చెప్తున్నారు.