సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (10:52 IST)

ప్రతిరోజూ బ్రకోలీని తీసుకుంటున్నారా? బరువు తగ్గేందుకు?

బ్రకోలీ రుచికరమైన పోషకమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగిఉంది. ఇది కొలెస్ట్రాల్‌, అలర్జీలు, కీళ్లనొప్పులు వంటి వ్యాధులను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వలన వృద్ధాప్య

బ్రకోలీ రుచికరమైన పోషకమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగిఉంది. ఇది కొలెస్ట్రాల్‌, అలర్జీలు, కీళ్లనొప్పులు వంటి వ్యాధులను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వలన వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్స్, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి.
 
ఇది అధిక బరువును తగ్గిస్తుంది. బ్రకోలీ కోలన్ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ప్రతిరోజు బ్రకోలీ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విటమిన్ సి, కె అధికంగా అందుతాయి. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివలన ఆహార పరిణామం తగ్గిపోతుంది. బరువు తగ్గడానికి మాత్రమే బ్రకోలీని తీసుకోవడం సరికాదు.
 
ఇతర ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకోవాలి. ఉదాహరణకి నూడిల్స్‌కు బదులు ఉడికించిన బ్రకోలి సూప్‌ను తీసుకోవచ్చును. బ్రకోలీని ఉడికించి లేదా పచ్చిగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. దీనివలన పోషకాలు నశించకుండా ఉంటాయి.