కీరదోసకాయ తింటే బరువు తగ్గుతారా?
కీరదోసకాయలో కొవ్వు నిల్. తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన చిరుతిండి అని చెప్పవచ్చు. కాబట్టి కొన్ని కీరదోసకాయలను సలాడ్‌లలో వేసుకుని తినండి. బరువు తగ్గడానికి ఇది బాగా దోహదం చేస్తుంది. కొందరు కీరదోసకు నిమ్మరసం, ఉప్పు, నల్ల మిరియాలు జోడించి తింటుంటారు రుచి కోసం.
రోజుకు ఒక్క కీరదోసకాయ తినడం మంచిది. ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది. కాబట్టి, మీరు ఒకటి కంటే ఎక్కువ తింటే, అది ఎటువంటి హాని కలిగించదు. జంక్ ఫుడ్ తినకుండా ఇలాంటివి తింటుంటే కొవ్వు పెరగకుండా వుంటుంది.