సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (19:53 IST)

దోసకాయ నీటిని వేసవిలో తాగితే.. కాస్త నిమ్మ, పుదీనా జోడిస్తే..?

Cucucmber Water
దోసకాయలో కనిపించే పొటాషియం ఎలక్ట్రోలైట్, ఇది మూత్రపిండాలచే నిర్వహించబడే సోడియం మొత్తాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సోడియం అధికంగా ఉన్న ఆహారం అధిక రక్తపోటుకు దారితీస్తుంది, కాబట్టి వేసవిలో దోసకాయ నీరు తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలని వైద్యులు ప్రజలకు సలహా ఇస్తారు. 
 
వేసవిలో నీటిలో దోసకాయను జోడించడం వల్ల ఆ నీరు మంచి రుచి ఉండటమే కాకుండా చర్మం,  శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. దోసకాయలలో మంచి మొత్తంలో విటమిన్ కె ఉంటుంది. మన ఆరోగ్యం బలంగా ఉండటానికి, మన కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడానికి సాయపడుతుంది. దోసకాయ లో విటమిన్ బి 5 ను మంచి మొత్తంలో ఉండటం వల్ల ప్రతిరోజూ దోసకాయ నీరు త్రాగటం మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది.
 
దోసకాయ నీరు ఎలా తయారు చేయాలంటే... 
కావలసిన పదార్థాలు
దోసకాయ ముక్కలు- రెండు కప్పులు 
నీరు - ఒకటిన్నర లీటర్
ఉప్పు - తగినంత 
 
తయారీ ఇలా.. దోసకాయ ముక్కలను, ఉప్పును ఒక పెద్ద గిన్నెలో కలపాలి. అందులో నీరు పోసి సమానంగా కలపాలి. రాత్రిపూట రిఫ్రిజిరేటర్లో ఉంచి చల్లబరచవచ్చు, లేదా గది నార్మల్ ఉష్ణోగ్రతలో కూడా అలాగే ఉంచవచ్చు. ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు ఆ నీటిని సేవించాలి. 
Cucucmber Water


దీన్ని తయారు చేసి నిల్వచేసుకుని మూడు రోజుల పాటు దీనిని సేవించవచ్చు. ఈ దోసకాయ నీళ్ళలో నిమ్మ, నారింజ, పైనాపిల్, పుదీనా లేదా తులసి ఆకులు వంటి వాటిని కూడా కలపవచ్చు. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి లభించడంతో పాటు వేసవిలో శరీరానికి కావలసిన పోషకాలు శరీరానికి అందుతాయి.