బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 జనవరి 2021 (00:02 IST)

వంకాయలు-నిమ్మకాయలతో వెరైటీ రైస్

రుచిగా పదార్థాలను చేసుకోవడం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే వుండాలంటారు పెద్దలు. ఇపుడు మనం ఓ వెరైటీ వంటకాన్ని చూద్దాం. వంకాయలు, నిమ్మకాయలతో రైస్ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
లేత వంకాయలు- రెండు
లవంగాలు- నాలుగు
ఏలక్కాయలు- నాలుగు 
గసగసాలు- అర టీస్పూన్ 
సోంపు- అర టీస్పూన్ 
లవంగం పట్ట- ఒకటి
నిమ్మకాయలు- మూడు
ఉడికించిన అన్నం- తగినంత
నూనె- సరిపడా
ఉప్పు- తగినంత
సన్నగా తరిగిన కొత్తిమీర- అర కప్పు
 
తయారీ విధానం :
లేత వంకాయలను సన్నగా తరిగి రెండు టీ స్పూన్ల నూనెతో వేయించి అందులో లవంగాలు, యాలక్కాయలు, గసగసాలు, సోంపు, లవంగం పట్టలతో నూరిన మసాలా ముద్దను వేసి బాగా వేయించాలి. ఈ మిశ్రమానికి నిమ్మరసాన్ని కూడా పట్టించి కాసేపు సన్నటి మంటపై ఉడికించాలి.
 
చివరగా పై మిశ్రమంలో ఉడికించిన అన్నాన్ని కలుపుకొని... కాసేపు వేయించి పైన కొత్తిమీరను చల్లి దించేయాలి. అంతే.. వంకాయ-నిమ్మతో రైస్ రెడీ.