మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 1 సెప్టెంబరు 2021 (20:15 IST)

రక్తపోటును క్రమబద్ధీకరించే కీరదోస

కీరదోస ఆరోగ్యంతో పాటు అందానికి కూడా పనిచేస్తుంది. ఈ కీరదోస గురించి కొన్ని విషయాలు చూద్దాం.
 
రక్తపోటులో తేడా ఏర్పదినవారికి దోసకాయలో ఉన్న పొటాసియం రక్తపోటు లోని హెచ్చుతగ్గులను సవరిస్తుంది.
 
దోసలోని లవణాలు గోళ్ళను అందంగా, చిట్ల కుండా ఉంచుతాయి.
 
కళ్ళ కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగిస్తాయి. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి.
 
శిరోజాల ఎదుగుదలకు దోస లోని సల్ఫర్, సిలికాన్ దోహదపడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
దోస కడుపులోని మంటను తగ్గిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
 
దోస తొక్కలో విటమిన్ కే సమృద్ధిగా ఉన్నందున చర్మానికి మేలు చేకురుతుంది.