మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (18:36 IST)

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే అల్లం..

తలనొప్పిగా వుందా.. ఇంకా మైగ్రేన్ తలనొప్పి వేధిస్తుందా.. అయితే అల్లాన్ని ఉపయోగించాలి. అల్లం పెయిన్‌ కిల్లర్‌‌గా పనిచేస్తుంది. అలాగే కఫం, దగ్గుకు అల్లం తేనె కలిపి ఇచ్చిన వెంటనే ఉపశమనం కలుగుతుంది. నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి. అలాగే ఎండిన అల్లం శొంఠిని పొడిగా చేసి అర స్పూన్‌ పొడి, ఆర స్పూన్‌ పంచదార కలుపుకొని పరకడుపున తినాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
బ్లెడ్‌ క్యాన్సర్‌ను నిరోధించడంలో అల్లం బాగా పని చేస్తుంది. రోజూ అల్లం టీ తాగడం వల్ల అజీర్తిని దూరం చేసుకోవచ్చు. అల్లాన్ని నిమ్మరసంలో నానబెట్టి పిల్లలకు మాసంలో రెండు సార్లు ఇస్తే.. ఉదర రుగ్మతలు తొలగిపోతాయి. గుండెలో మంట వచ్చినప్పుడు అల్లం తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇంకా శరీర బరువును తగ్గిస్తుంది.