శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (13:11 IST)

మొటిమలు తగ్గాలంటే క్యాప్సికమ్ తినండి..

కాప్సికమ్‌ నొప్పిని తగ్గించే ఏజెంట్‌గా పనిచేస్తుంది. పెయిన్ కిల్లర్‌గా ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది. డయేరియాను నివారిస్తుంది. స్టొమక్ అల్సర్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణుల

కాప్సికమ్‌ నొప్పిని తగ్గించే ఏజెంట్‌గా పనిచేస్తుంది. పెయిన్ కిల్లర్‌గా ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది. డయేరియాను నివారిస్తుంది. స్టొమక్ అల్సర్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్యాప్సికమ్స్ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సౌందర్యం పెంపొందుతుంది. ఎలాగంటే మొటిమలు లేకుండా ముఖఛాయ పెరుగుతుంది. ఇందులోని విటమిన్ ఎ కళ్ళకు ఎంతో మేలు చేస్తుంది. 
 
క్యాప్సికమ్ క్యాన్సర్‌ను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో కాంపౌండ్స్ రక్తకణాలతో కలిసి క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. జుట్టు రాలిపోతుంటే.. క్యాపికమ్‌ను ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. అలాచేస్తే జుట్టు పెరుగుతుంది. క్యాప్సికమ్‌ బరువును తగ్గిస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. క్యాప్సికమ్‌లో కేయాన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది పెయిన్ రిలీఫ్‌గా పనిచేస్తుంది. ఆర్థరైటిస్, రుమటాయిడ్స్‌ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.