1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (19:03 IST)

శెనగలు ఉడికించిన నీటితో వేడి వేడి రసం తయారు చేస్తే?

Chick peas Rasam
పెద్ద శెనగలు ఉడికించిన నీటిని తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కుక్కర్లో శెనగలను ఉడికించి ఆ నీటిని పారబోయకుండా మిరియాల రసం తయారు చేస్తే భోజనానికి సూపర్ కాంబోగా మారిపోతుంది.

శెనగలను ఉడికించిన నీటితో మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, టమోటా, ఇంగువను చేర్చి రసంలా పెడితే టేస్టు చాలా బాగుంటుంది. ఎందుకంటే.. శెనగలను నానబెట్టిన నీళ్లల్లో ఉడికించినప్పుడు ఆ నీళ్ళల్లో కూడా మంచి పోషక పదార్థాలు వుంటాయి కాబట్టి.
 
ఆ నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఇక దానిలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి అనే విషయం లోకి వస్తే.. విటమిన్ డి, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అంటే లినొలెనిక్ లేదా ఒలిక్ యాసిడ్ లాంటివి ఉంటాయి. శాకాహారులు గుడ్డును తీసుకోకపోతే ఎగ్ వైట్‌కి బదులుగా దీనిని ఉపయోగించవచ్చు. మంచి ప్రోటీన్స్ మరియు స్టార్చ్ దీని ద్వారా మనం పొందవచ్చు.