బుధవారం, 15 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (22:54 IST)

మనీ ప్లాంట్‌ను పెంచితే డబ్బు వస్తుందా?

వాస్తు ప్రకారం చాలామంది తమ ఇళ్ళలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుతుంటారు. ఇంట్లో ఉంటే మంచిదని, సంపద తీసుకువస్తుందని చెబుతుంటారు. మనీ ప్లాంట్ వల్ల నిజంగా సంపద వస్తుందా అన్న సందేహం కలుగుతుంటుంది. ఈ విషయంలో వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఒకసారి తెలుసుకుందాం.
 
మనీ ప్లాంట్ పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దానివల్ల ఇంట్లో ఉన్న మనుషుల్లో కొత్త రకమైన ఉత్తేజం కలుగుతుంది.  ఆ ఉత్తేజంతో సంతోషం వెల్లువిరుస్తుంది. ఏ సమస్యా లేనపుడే మనిషి ఆనందంగా నవ్వగలడు. ప్రధానంగా డబ్బు సమస్య లేకపోతే. మనీ ప్లాంట్ వల్ల డబ్బు ప్రవాహం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అంటే అనుకున్న పనులు సరిగ్గా జరగడమో, రావాల్సిన డబ్బులు రావడమో అవుతుందని నమ్ముతారు.
 
అదీగాక మనీ ప్లాంట్ వల్ల ఇల్లు అలంకరణ అందంగా ఉంటుంది. ఇంకా బంధాల్లో దృఢత్వం చోటు చేసుకుంటుంది. ఈ మనీ ప్లాంటుని కుండీల్లో గానీ బాటిళ్ళలో గానీ పెంచవచ్చు.