శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (12:28 IST)

భార్యాభర్తలు వాదించుకోవడం ఆపి.. ప్రేమించుకుంటే.. మధుమేహం..

దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న వేళ.. డయాబెటిస్ నియంత్రణకు పోషకాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందని వైద్యులు చెప్తుంటారు. తాజాగా మధుమేహాన్ని తరిమికొట్టాలంటే.. ముందు వాదించడం మానుకోవాలని చెప్తున్నారు. దంపతులు ఎక్కువగా వాదించుకోవడం ఆపితే మధుమేహం దానంతట అదే ఆగిపోతుందని అంటున్నారు. 
 
చాటింగ్, ఫోన్‌లలో వాదించుకోవడం, జగడానికి దిగడం వంటివి చేస్తే మధుమేహం తప్పదని జనం అంటున్నారు. తాజాగా తరచూ జీవిత భాగస్వామితో గొడవపడేవారికి షుగర్ త్వరగా వచ్చేస్తుందని అధ్యయనంలో తేలింది. 
 
మధుమేహం సమస్యలు ఉన్న రెండు వర్గాల వ్యక్తుల మీద విడివిడిగా జరిపిన పరిశోధనలో, జీవిత భాగస్వామితో తగాదాలు పడేవారిలో అనారోగ్య సమస్యలు తీవ్రంగా పెరిగినట్లు తేలింది. అందుచేత వాగ్వివాదాలకు పోకుండా మిన్నకుండిపోవడం మంచిదని వైద్యులు సెలవిస్తున్నారు. అంతేకాకుండా ప్రేమగా ఆప్యాయతగా పలకరించుకుంటే మధుమేహం మాత్రమే కాకుండా.. అనారోగ్య సమస్యలు ఏమాత్రం దరికి చేరవని వారు సూచిస్తున్నారు.