కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు
కిడ్నీ సమస్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఈ సమస్య రాకుండా వుండాలంటే.. దుంపలు వంటివి తీసుకుంటుండాలి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తాయి. కొబ్బరి నీరు, దోసకాయ రసం, చెర్రీస్ కూడా మేలు చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునేందుకు ఇంకా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో తెలుసుకుందాము.
ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు క్యాలీఫ్లవర్, బ్లూబెర్రీలు వంటివి తీసుకుంటుండాలి.
శారీరక శ్రమను దినచర్యలో భాగంగా చేసుకోవాలి.
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి.
ప్రతిరోజూ తగినంత నిద్ర పొందాలి.
పొగత్రాగే అలవాటు వున్నవారు దాన్ని మానేయాలి.
మద్యం తీసుకోవడాన్ని తగ్గించాలి.
ఒత్తిడిని తగ్గించే చర్యలైన యోగా, ధ్యానం చేయాలి.
మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులున్నవారు చికిత్స తీసుకుని ఆరోగ్యవంతంగా వుండాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.