ఎత్తు తక్కువున్నవారికి డయాబెటిస్ వస్తుందా?
మధుమేహం జీవితాంతం కొనసాగే సమస్య. సూక్ష్మంగా చెప్పాలంటే మధుమేహం అంటే రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండడం. ఇది ఎవ్వరికైనా రావచ్చు. కానీ పొడవు తక్కువ ఉన్న వారిలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఇదే విషయం తాజాగా ఒక పరిశోధనలో వెల్లడైందట.
ఎత్తు తక్కువగా ఉన్న పురుషులలో 41 శాతం, స్త్రీలలో 33 శాతం వరకు మధుమేహం వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. హైట్ తక్కువగా ఉండటం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, వాపు ప్రక్రియలు సైతం ఎక్కువగానే ఉండడాన్ని గుర్తించారు.
ఇవన్నీ మధుమేహాన్ని తెచ్చిపెట్టేవేనట. ఎత్తు తక్కువ ఉన్నవారు మధుమేహం రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.